హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో నూతన కామన్ డైట్‌ను తప్పక పాటించాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. గురుకులాలపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు యూనిఫామ్ ఈ నెల చివరిలోగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డైట్ చార్జీలకు రూ.170 కోట్లు విధుల చేశామని, అద్దె బకాయిల బిల్లులను మంజూరు చేశామని తెలిపారు.