హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపింది. ఇప్పటికే రాత్రిపూట చలికి జనం గజ గజ వణుకుతున్నారు.
మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. జోగులాంబ -గద్వాల, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించా రు. మరో వారంపాటు పొడివాతావరణం ఉంటుదని తెలిపారు. కుమ్రం భీం జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 10.4 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు.