హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : ఇసుక రవాణాదారులతో గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్ మంగళవారం సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కోరారు. నిబంధనలకు లోబడి ఉండే ఎలాంటి సూచనలనైనా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
ఇసుక లభ్యతను మరింత సులభతరం చేయడంతోపాటు రీచ్‌ల వద్ద లారీల్లో వెంటనే ఇసుక లోడింగ్ జరిగేలా చూడాలని రవాణాదారులు స్పష్టం చేశారు. రవాణాకు అనువైన రీచ్‌లను ఎంపికచేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. ఇసుక కాంట్రాక్టర్లు, అధికారుల అక్రమ వసూళ్లను అరికట్టి, ఇసుక బుకింగ్‌లను సులభతరం చేయాలని సూచించారు.