Telangana | రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ఆందోళనకు దిగారు.
రేవంత్ రెడ్డి సరఫరా చేసే బియ్యం మొత్తం ప్లాస్టిక్ లెక్క ఉంటున్నాయని నిజామాబాద్ జిల్లా వేంపూర్కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికురాలు తెలిపారు. పిల్లలకు ఏమన్న అయితే మమ్మల్నే అంటారు కదా అని ఆవేదన చెందారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు భోజనం కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా పెట్టడం లేదని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు జీతాలు పెంచి, సమయానికి జీతాలు, బిల్లులు ఇచ్చిండని తెలిపారు. రేవంత్ రెడ్డి గత సంవత్సరం నుంచి జీతాలు, బిల్లులు ఇవ్వకపోవడంతో రూ.2లక్షల అప్పు చేసి, నా ఇల్లు తాకట్టు పెట్టి పిల్లలకు భోజనం పెడుతున్నానని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి జీతాలు, బిల్లులు ఇవ్వక నాకు రూ.2 లక్షలు అప్పు అయింది
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన మధ్యాహ్న భోజన కార్మికులు
రేవంత్ రెడ్డి సరఫరా చేసే బియ్యం మొత్తం ప్లాస్టిక్ లెక్క ఉంటున్నాయి, పిల్లలకు ఏమన్న అయితే మమ్మల్ని అంటారు కదా?
ప్రభుత్వ… pic.twitter.com/dtCrGM5pEg
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2025
పిల్లలకు వంట చేద్దామంటే వంట సామాన్లు ఇస్తలేరని.. తమకు జీతాలు కూడా ఇస్తలేరని నిర్మల్ నుంచి వచ్చి ధర్నాలో పాల్గొన్న మధ్యాహ్న భోజన కార్మికురాలు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు పస్తులు ఉండొద్దని అప్పులు చేసి వంట సామాన్లు కొని భోజనం పెడుతున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇచ్చే బియ్యం బాగోలేవని.. అన్నం అంతా గంజిలాగా అవుతుందని పేర్కొన్నారు. ఆ అన్నం పిల్లలు ఎవరూ తినడం లేదని తెలిపారు.
రేవంత్ రెడ్డి పిల్లలకు పంపే బియ్యం మొత్తం రబ్బర్ లెక్క ఉంటున్నాయని నిజామాబాద్ జిల్లా వేంపూర్కు చెందినమధ్యాహ్న భోజన కార్మికురాలు తెలిపారు. పిల్లలు రెండు కూరలు పెట్టాలి, కోడిగుడ్డ పెట్టాలని జీవో విడుదల చేసి.. అసలు సామాన్లు పంపించడమే ఆపేసిండని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా పేద విద్యార్థులకు పంపించే నాసిరక వంట సామాన్లే వాడతారా అని ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు మా బాధలు చెబితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని అంటున్నారని తెలిపారు. వెంటనే తమ జీతాలు పెంచి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చనిపోతామని అన్నారు. వంట సామాన్ల కోసం షాపుల దగ్గరకు వెళ్తే, మధ్యాహ్న భోజన కార్మికులు వస్తున్నారని.. ఉచితంగా సామాన్లు అడుగుతారని భయపడుతున్నారని తెలిపారు. ఏసీలో కూర్చొని చూడటం కాదు.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు అని సవాలు విసిరారు.
రేవంత్ రెడ్డి పిల్లలకు పంపేవి మొత్తం రబ్బర్ బియ్యం లెక్క ఉంటున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన
పిల్లలకు రెండు కూరలు పెట్టాలి, కోడిగుడ్లు పెట్టాలని జీవో విడుదల చేసి, అసలు సామాన్లు పంపడమే ఆపేసిండు
రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా పేద విద్యార్థులకు… https://t.co/rW41KWn532 pic.twitter.com/ak6ggFvGOv
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2025
8 నెలల నుంచి మాకు జీతాలు లేవు.. సంవత్సరం నుంచి వంట సామాన్ల బిల్లులు లేవని మరో కార్మికురాలు తెలిపారు. మేం గెలిస్తే వంట మనుషుల జీతాలు పెంచుతామని మాటిచ్చి.. ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పిల్లలకు భోజనం పెట్టడానికి మా పట్ట గొలుసులు కూడా అమ్మేసుకుంటున్నామని ఆవేదన చెందారు.
8 నెలల నుండి మాకు జీతాలు లేవు, సంవత్సరం నుండి వంట సామాన్ల బిల్లులు లేవు
కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు, బిల్లులు ఇవ్వడం లేదని నిరసనకు దిగిన ప్రభుత్వ పాఠశాలల్లోని వంట మనుషులు
మేము గెలిస్తే వంట మనుషుల జీతాలు పెంచుతామని మాటిచ్చి, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు
పిల్లలకు భోజనం… pic.twitter.com/OV2kzsnYNJ
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2025
కేసీఆర్ ఉన్నప్పుడు పిల్లలకు పొద్దున టిఫిన్ పెట్టి, సమయానికి బిల్లులు కూడా ఇచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చాక 11 నెలలు టిఫిన్ పెట్టి బిల్లులు అడిగితే, కేసీఆర్ పెట్టిన పథకానికి మేమెందుకు బిల్లులు ఇస్తామంటున్నారని ఆవేదన చెందారు. 12 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గోసపెడుతున్నారని అన్నారు.
మంత్రి సీతక్క జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదన
కేసీఆర్ ఉన్నప్పుడు పిల్లలకు పొద్దున టిఫిన్ పెట్టి, సమయానికి బిల్లులు కూడా ఇచ్చిండు
రేవంత్ రెడ్డి వచ్చాక 11 నెలలు టిఫిన్ పెట్టి బిల్లులు అడిగితే, కేసీఆర్ పెట్టిన పథకానికి మేము ఎందుకు బిల్లులు ఇస్తామని అంటున్నారు
8 నెలల నుండి… pic.twitter.com/vgYrNLsoDR
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2025