రామగిరి, జూలై 8: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బాలికల హాస్టల్లో నీటి స మస్య తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థిను లు మంగళవారం ఎదుట నిరసన తెలిపారు. నేరుగా వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గెస్ట్ హౌస్ ను ముట్టడించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి వచ్చి సమాధానం చెప్పే ప్రయ త్నం చేసినా వినకపోవడంతో వీసీ వచ్చి మా ట్లాడారు.
వీసీ విద్యార్థినులతో ‘మీరు.. పరీక్షలు ఎలా రాస్తా రు? మీరంతా పాసవుతా రా?’ అంటూ బెదిరించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఆందోళన కొ నసాగింది. ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి బుధవారం ఉదయం వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.