హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికుల సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ అట్టర్‌ప్లాప్ అయిందని పేర్కొంటూ, ఖాళీ కుర్చీలతో ఉన్న ఫొటోలను బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్స్ పోస్ట్ చేశారు. దీనిపై రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తన స్థాయిని మరిచిపోయి బూతులు తిడుతూ మెసేజ్ చేశారు. ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తికి సాయికుమార్ పర్సనల్ మెసెంజర్లో తిడుతూ మెసేజ్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.