హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెర వెనుక కథ వేరే ఉన్నది. ఈ డిస్కం పేరిట వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించే ప్రణాళికకు ప్రభుత్వం తెరలేపింది. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్మీటర్లను బిగించనున్నది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాతే ఆయా కనెక్షన్లను కొత్త డిస్కం పరిధిలోకి బదలాయిస్తారు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకున్నది. స్మార్ట్మీటర్లను బిగించేందుకు పచ్చజెండా ఊపింది. అయితే, మూడో డిస్కంతో కొత్త చిక్కులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. భౌగోళిక ప్రాంతం ఆధారంగా కాకుం <డా.. కనెక్షన్ల ప్రాతిపదికన కొత్త డిస్కంను ఏర్పాటుచేయడం కొత్త వివాదాలకు దారితీస్తుందని విద్యుత్తు రంగ నిపుణులు చెప్తున్నారు. ఇది తిరోగమన నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటు చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన జీవో మాత్రమే విడుదల కావాల్సి ఉన్నది.
28.9 లక్షల కనెక్షన్లు
ఉత్తర, దక్షిణ డిస్కంల పరిధిలోని వ్యవసాయ, ఎత్తిపోతలు, జలమండలి, మిషన్ భగీరథ కనెక్షన్లను ఈ కొత్త డిస్కం పరిధిలోకి చేర్చుతారు. కొత్త డిస్కం పరిధిలో మొత్తం 28,90,686 కనెక్షన్లు చేరనుండగా, ఇందులో అత్యధికంగా 28.89 లక్షల కనెక్షన్లు వ్యవసాయరంగానికి సంబంధించినవే ఉన్నాయి. 429 లిఫ్ట్ ఇరిగేషన్, 60 జలమండలి, 276 మిషన్ భగీరథ కనెక్షన్లున్నాయి. డిస్కంల వారీగా తీసుకుంటే దక్షిణ డిస్కంలో 15.2 లక్షలు, ఉత్తర డిస్కంలో 13.7 లక్షల కనెక్షన్లున్నాయి. ప్రస్తుతమున్న ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ లైన్లు కొత్త డిస్కంకు ఆస్తులుగా వస్తాయి. వెయ్యిమంది అధికారులు, వెయ్యిమంది సిబ్బంది చొప్పున మొత్తం రెండు వేల మంది కొత్త డిస్కంలో ఉంటారు. వీరిని ఇప్పుడున్న డిస్కంల నుంచి డిప్యుఏటేషన్పై తీసుకుంటారు.
అప్పులన్నీ కొత ్తడిస్కంపైనే..
పాత అప్పులన్నింటిని కొత్త డిస్కంలోకి బదలాయించనున్నారు. పాత డిస్కంల అప్పులన్నీ కొత్త డిస్కంపైనే మోపనున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినవి 35,982 కోట్లు, రుణాలు రూ.9,032 కోట్లు కొత్త డిస్కం ఖాతాలోనే పడనున్నాయి. జెన్కో, సింగరేణికి డిస్కంలు రూ.26,950 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఈ చెల్లింపు బాధ్యతలు కొత్త డిస్కం ఖాతాలోకే చేరుతాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను బదలాయించనున్నారు. అయితే, వ్యవసాయ కనెక్షన్లతో కొత్త డిస్కం ఏర్పాటు ప్రయత్నాలు పలు రాష్ర్టాల్లో విఫలమయ్యాయి. ఏపీలో కొత్త డిస్కంను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. మహారాష్ట్రల్లోనూ ఇదే తరహాలో ప్రయత్నించారు. కానీ, ఇంత వరకు ఆపరేషన్లోకి రాలేదు. ఈఆర్సీ కొత్త డిస్కం ఏర్పాటుకు అనుమతినివ్వలేదు. దీంతో ఆయా ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ఈఆర్సీ పరిశీనలనలో ఉన్నది.
కొత్త చిక్కులివే..