Weather Update | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావారణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.
ఈనెల 6,7 తేదీల్లో ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అటు ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది.