హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ):వాతావరణ హెచ్చరికలపై వాతావరణశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రావణి పలు విషయాలు వెల్లడించారు. ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్‌ల జారీ, ఉష్ణోగ్రతలు, వర్షపాతాల లెక్కింపు, తుఫానులు, వర్షపాతాన్ని కొలవటం.. వాటి కోసం వాడే పరికరాల పనితీరును వివరించారు. ‘వర్షపాతం వివరాలతో పాటు 4 నెలల పాటు నైరుతి రుతుపవనాలు దేశానికి ముఖ్యమైనవి. వీటిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అబ్జర్వేటిస్ (రెయిన్గోస్), శాటిలైట్ మీజర్మెంట్స్, మేఘాలు (క్లౌడ్స్) కీలకమైనవి.
మేఘాలు రెడ్ కలర్లో ఉంటే వర్షం కురిసే అవకాశం ఉంటుంది. శాటిలైట్‌లో 3డీ మీజర్మెంట్స్ను తీసుకుంటాం. దీంతో వచ్చే 10 రోజుల్లో ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉంటుందో తెలుసుకోవచ్చు. మేఘాల దిశ ఆధారంగా వచ్చే 3 గంటల్లో ఎక్కడ వర్షపాతం కురుస్తుందనేది తెలుసుకోవచ్చు. పిన్ పాయింట్ లోకేషన్లో వచ్చే అరగంటలో ఎక్కడెక్కడ వర్షం కురుస్తుందనేది తెలుసుకునేలా ‘రెయిన్ అలారం యాప్’కు అనుసంధానం చేశాం. ఇది దేశంలోని అన్ని రాడార్ల చిత్రాల సమాచారాన్ని సేకరిస్తుంది. దీని ద్వారా చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఎటువైపు వర్షం కురుస్తుందనేది తెలుసుకోవచ్చని’ వెల్లడించారు.
‘వర్షపాతాన్ని కొలిచేందుకు ముఖ్యంగా రెయిన్‌గేజ్ పరికరాన్ని ఉపయోగిస్తాం. 204.5 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం కురిసే అవకాశం ఉంటే దానిని అత్యంత భారీ వర్షంగా పేర్కొని.. రెడ్ అలర్ట్‌గా ప్రకటిస్తాం. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో 24 గంటల్లో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం’ అని డాక్టర్ శ్రావణి తెలిపారు. బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన ఆవర్తనం ఒకటి, రెండు రోజుల్లోనే అల్పపీడనంగా మారుతుంది. ఇది కొనసాగితే వాయుగుండంగా మారుతుంది.
వర్షపాతం కొలిచే సమయాలు
తెలంగాణలో అధికారికంగా రామగుండం, నిజామాబాద్, హైదరాబాద్‌లో ఐఎండీ కేంద్రాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారి రామారావు తెలిపారు. ‘ఈ మూడు ప్రధాన కేంద్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేం ద్రాలు, ఎంఆర్వో కేంద్రాలతో పాటు 60 ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఉదయం 8.30, సాయంత్రం 5.30 గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, 12 గంటలు, 15 గంటలకోసారి వర్షపాతాన్ని లెక్కిస్తాం. జీహెచ్ఎంసీ సహకారంతో 140 కేంద్రాల నుంచి కూడా వాతావరణ సమాచారం సేకరిస్తు న్నాం. రెయిన్‌గేజ్ ద్వారా వర్షపాతం గుర్తిస్తాం. 3 గంటలకు ఒకసారి లెక్కి స్తాం. ఎన్ని గంటలకు ఎంత వర్షపాతం నమోదైందని దీంతో తెలుస్తుం ది. స్టీవెన్ సన్‌స్క్రీన్ పరికరంతో ఉష్ణోగ్రతలను కొలుస్తాం. ఈ స్క్రీన్‌లో 4 థర్మామీటర్లు ఉంటాయని వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును అధికారులు పొడిగించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 19 వరకు అవకాశమిచ్చినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.