హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే 10 రోజులపాటు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో -28 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. ఇవే పరిస్థితులు కొనసాగితే జూలై 22, 23 తేదీల నాటికి -50 శాతం లోటు వర్షపాతం నమోద య్యే పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది.