Weather Alert | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదురోజుల్లో ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసినట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అకడకడ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడుతాయని.. ఈ సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ చేశామని పేర్కొంది.