Inter Students | 90% మార్కులు దాటినా నిరాశే.. ఇంటర్ విద్యార్థుల్లో మార్కుల ఫీవర్
Inter Students | పరీక్షల్లో పాసైతేనే ఎగిరి గంతేసే పరిస్థితులు పోయాయి. ఫస్ట్ క్లాస్‌లో పాసైతే ఘనంగా చెప్పుకునే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు 90% మార్కులకు విద్యార్థులు సంతృప్తిచెందడంలేదు. చివరికి 988, 975 మార్కులొచ్చినా ఓర్చుకోవడంలేదు. ప్రత్యేకించి ఇంటర్ విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
Inter Students | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : పరీక్షల్లో పాసైతేనే ఎగిరి గంతేసే పరిస్థితులు పోయాయి. ఫస్ట్ క్లాస్‌లో పాసైతే ఘనంగా చెప్పుకునే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు 90% మార్కులకు విద్యార్థులు సంతృప్తిచెందడంలేదు. చివరికి 988, 975 మార్కులొచ్చినా ఓర్చుకోవడంలేదు. ప్రత్యేకించి ఇంటర్ విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న విడుదలయ్యాయి. ఈ సారి విద్యార్థులు భారీగా మార్కులు సాధించారు. కొందరు విద్యార్థులు ఒకటి రెండు మార్కులు తక్కువగా వచ్చినా అస్సలు సంతృప్తిచెందడంలేదు. తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు. అనుకున్న మార్కులు రాలేదని, తక్కువ మార్కులు వచ్చాయి.. మా జీవితం వ్యర్థం.
ఇక అంతా ముగిసినట్టే అన్న భావనలో ఉన్నారు. దీంతో తల్లిదండ్రులకు టెన్షన్ తప్పడంలేదు. ఇటీవల సీబీఎస్ఈ ఫలితాల్లో కేరళ విద్యార్థికి ఒక్క మార్కు తక్కువగా వచ్చింది. 500 మార్కులకు 499 రాగా.. ఆ ఒక్క మార్కు కోసం రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నది. అన్ని సబ్జెక్టుల్లో 100కు వంద మార్కులు రాగా, ఒక్క సైన్స్ సబ్జెక్టులో 100కు 99 మార్కులొచ్చాయి. అంతే ఒక్క మార్కు కోసం రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యార్థులు ఈ మార్కుల వేట నుంచి బయటపడాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు..
- ఓ అమ్మాయికి ఇంటర్ సెకండియర్‌లో 975 మార్కులొచ్చాయి. అంతే తీవ్ర నిరాశలోకి వెళ్లింది. ఈ అమ్మాయి 985 మార్కులు వస్తాయని అంచనా వేసింది. ఫలితాలు రాగానే ముసుగేసింది. డిప్రెషన్లోకి వెళ్లింది. కేవలం 10 మార్కులు తగ్గినందుకు జీర్ణించుకోలేకపోయింది.
- మరో అమ్మాయికి సెకండియర్‌లో 988 మార్కులొచ్చాయి. అదే కాలేజీలోని కొందరు విద్యార్థులకు 990 మార్కులు రాగా, వారి పేర్లతో ప్రచారం చేశారు. అంతే తాను చేజార్చుకున్నానన్న భావనతో ఒక్కటే ఏడుపు.
- మరో విద్యార్థికి 965 మార్కులొచ్చాయి. అదే విద్యాసంస్థలో మరికొందరికి అంతకంటే ఎక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రుల నుంచి సదరు విద్యార్థికి చివాట్లు తప్పలేదు.
- మరో విద్యార్థికి 750 మార్కులు, ఇంకొందరికి 850 -950 మార్కులు వచ్చినా ఇంకా మార్కులు రావాల్సి ఉండేనన్న ఆలోచనలే కనిపించాయి.
ఇంటర్ మార్కులతో ఉపయోగమేలేదు..
వాస్తవానికి ఇంటర్ మార్కులతో ఉపయోగమే లేదు. ఎక్కడా ఈ మార్కులు పనిచేయవు. డిగ్రీలో చేరాలన్నా.. ఇంజినీరింగ్‌లో చేరాలన్నా ఈ మార్కులతో పనేలేదు. పాసైతే సరిపోతుంది. ఇది వరకు ఎప్‌సెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండేది. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ వెయిటేజీని తొలగించింది. జేఈఈలోనూ 12వ తరగతి మార్కుల వెయిటేజీని 2017లోనే ఉపసంహరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

