కంఠేశ్వర్, జనవరి 16: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట మెప్మా ఆర్పీలు ధర్నాకు దిగారు. ఆర్నెల్ల వేతనాలు విడుదల కాగా, ఐదు నెలలవి చెల్లించి, ఇంకో నెల వేతనం నిలిపి వేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
ఇప్పటిదాకా అన్ని సర్వేల్లో పాల్గొన్నామని, అనారోగ్య కారణాలతో కొంత మంది గైర్హాజరైతే వేతనాలు ఆపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. దీనిపై మెప్మా పీడీ రాజేందర్‌ను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నామని, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని వారిని సంజాయిషీ ఇవ్వాలని కోరామని చెప్పారు.
న్యూఢిల్లీ: ‘యాపిల్’ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పందొమ్మిదేళ్ల వయసులో కుంభమేళాపై రాసిన లేఖ వేలంలో రూ.4.32 కోట్లు పలికింది. భారతలో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభ మేళాకు తాను వెళ్లాలనుకుంటున్నానని దీనిలో రాశారు. ‘శాంతి స్టీవ్ జాబ్స్’ అని సంతకం చేశారు. స్టీవ్ అప్పట్లో ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలీబాబా ఆశ్రమంలో ఏడు నెలలు గడిపారు.
ఇంటికి వెళ్లిన తర్వాత, ‘నేను గుండు చేయించుకున్నాను. భారతీయ కాటన్ వస్ర్తాలను ధరించాను. చర్మం చాకొలెట్ బ్రౌన్-రెడ్ రంగులోకి మారింది’ అని రాశారు. జాబ్స్ మరణించినప్పటికీ, ఆయన సతీమణి లారెన్ మహా కుంభ మేళాకు హాజరయ్యారు. ఆమె పేరును ‘కమల’గా మార్చుకున్నారు. స్వామి కైలాసానంద గిరి వద్ద ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు.