యాదగిరిగుట్ట, మే24 : యాదగిరిగుట్టపై వర్తక సంఘాన్ని రద్దు చేయాలంటూ ఆదివారం యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆందోళన చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి స్వామి వారి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవస్థాన అధికారులు వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లకు పిలవాలని డిమాండ్ చేశారు. పాత బస్ స్టాండ్ వద్ద రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు.
ఈ నెల 31 వ తేదీన వర్తక సంఘం గడువు ముగిసిపోతుందని, వెంటనే కొండపైన దుకాణాలకు టెండర్లు వేయాలని డిమాండ్ చేశారు. టెండర్లు వేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. సెలవు దినం కావడంతో భారీగా భక్తుల వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన చేస్తున్న సభ్యులను పోలీసులు చెదరగొట్టారు.