హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్, మెట్రోవాటర్ వర్స్ పనులకు సంబంధించి 18 శాతం జీఎస్టీ డిమాండ్ వ్యవహారంలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 10 శాతం జీఎస్టీ సొమ్ము డిపాజిట్ చేశాక మేఘాపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర జీఎస్టీ అధికారులను ఇటీవల ఆదేశించింది. ప్రభుత్వ పరిధిలోని స్థానిక సంస్థల పనులకు 18 శాతం జీఎస్టీ డిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ మేఘా కంపెనీ వేసిన పిటీషన్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
గతంలో 12 శాతానికి అంగీకరించిన అధికారులు ఇప్పుడు 18% అంటున్నారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, 2021 చట్టసవరణలో తకువ పన్ను ఎవరికి వర్తిస్తాయో స్పష్టంగా ఉందన్నారు . దీంతో ధర్మాసనం 10 శాతం డిపాజిట్ చేయాలని, విచారణ ముగిసేదాకా ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని జీఎస్టీశాఖలకు నోటీసులు ఇచ్చింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.