హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధంచేసేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలు గులాబీ సేనల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తున్నాయి. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీసేందుకు కుట్రపన్నుతున్న కాంగ్రెస్, బీజేపీకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని పార్టీ శ్రేణులు ప్రతినబూనుతున్నాయి. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం మూడు జిల్లాల్లో రైతన్నలకు భరోసాగా చేపట్టిన పొలంబాట పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నది. ఉద్యమకాలంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహంతో తెలంగాణ సమాజం ఏ తీరుగా మమేకం అయిందో అదేరీతిలో ప్రస్తుతం పరిణామాలు నెలకొన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నాయి.
ద్రోహులకు బుద్ధిచెప్పుడే
ఉద్యమకాలంలో పార్టీని చీల్చేందుకు నాడు కాం గ్రెస్ అనుసరించిన వ్యూహాన్ని బద్దలు కొడుతూ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన చరిత్ర తమదని ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం అవుతుందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టంచేస్తున్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు నాడు హస్తం చేసిన కుట్రలను తెలంగాణ సమాజం మరచిపోలేదని ఇప్పు డు అవే కుట్రలను బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయని వీటిని తిప్పికొడతామని సన్నాహక సమావేశాల్లో పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. తమది దశాబ్దాల చరిత్ర అని గొప్పలు చెప్పుకుంటున్న ఆ పార్టీలకు అభ్యర్థులు గతిలేక బీఆర్ఎస్ ఐదుగురు సిట్టింగ్ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లను తమ పార్టీలో చేర్చుకొని అభ్యర్థులుగా ప్రకటించుకోవటమే అందుకు నిదర్శమని ఉదహరిస్తున్నాయి. తమ స్వార్థ రాజకీయాల కోసం తల్లిలాంటి బీఆర్ఎస్ వీడిన ద్రోహులకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాయి. తాము స్వచ్ఛందంగా వారి భరతం పట్టేందుకు అవసరమైన కార్యాచరణను అమలుచేస్తామని బీఆర్ఎస్ నాయకులు పార్టీ అధిష్ఠానానికి నివేదిస్తున్నారు.
పోయినోళ్లు ఒంటరే
ప్రలోభాలకు, భయాలకు, స్వార్థ ప్రయోజనాలకు పార్టీని వీడిన నేతలు అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని గులాబీ శ్రేణులు కరాఖండిగా తేల్చిచెప్తున్నాయి. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీ, కాంగ్రెస్లో చేరినా, వారంతా ఒంటరి వారేనని పే ర్కొంటున్నాయి. వారితో మండల, నియోజకవర్గస్థా యి నాయకులెవరూ పార్టీని వీడలేదని, అదే తమకు ఉన్న నైతిక, భౌతిక బలమని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇద్దరు ముగ్గురు నేతలు స్వార్థం కోసం పార్టీని వీడినంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు తమ పేగుబంధాన్ని పార్టీ నుంచి తెం పుకోలేరని, అందుకు ఇటీవల వెళ్లిన నాయకులతో క్షేత్రస్థాయి కార్యకర్తలు చేరకపోవడమే తమకు ఆస్తి అని పార్టీ అగ్రనాయకత్వం ఉ దహరిస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో నే తాము పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి తీరుతామనే ధీమాను పార్టీ వ్యక్తం చేస్తున్నది.