హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం అమలు చేయనున్న నాలుగు నూతన లేబర్ కోడ్లకు సంబంధించి రాష్ట్ర నిబంధనల ఖరా రులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు యాజమాన్యాలు, ఉద్యోగు లు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నాయి.
గురువారం నుంచి 16 వరకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని టీ అంజ య్య భవన్ కార్మిక కమిషనర్ కార్యాలయంలో సమావేశాలు జరుగుతాయని లేబర్ కమిషనర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. అభిప్రాయాలు, సూచనలు చేయదలచిన వారు సమావేశాలకు హాజరుకావాలని కోరారు.