హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఎనర్జీ పాలసీపై వచ్చే నెల 3న సమావేశం నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హెచ్ఐసీసీలో జరుగనున్న ఈ సమావేశంలో భాగస్వామ్య సంస్థలు, ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. హరిత ఇంధనాన్ని ప్రోత్సహించడానికే గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకువస్తున్నామని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఏపీలో ఇంటర్ ఫీజు గడువు 31వరకు పొడిగింపు
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తేతెలంగాణ): ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజును ఈనెల 31 వరకు తతాల్ పథకం కింద చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు. గతంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు అపరాధ రుసుముతో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా 3వేల చొప్పున చెల్లించాలని ఆమె సూచించారు. ఫీజుకు సంబంధించి ఇక ఎలాంటి పొడిగింపు ఉండదన్నారు.