HomeTelanganaMeeseva Services On Whatsapp Launched Sridhar Babu
ఇక వాట్సాప్‌లో మీ-సేవ!.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మీ-సేవ కేంద్రాల్లో లభించే సే వలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వ చ్చాయి. మెటా, మీ-సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్'ను మంగళవారం బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రా రంభించారు.
580కిపైగా పౌరసేవలు అందుబాటులోకి..
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మీ-సేవ కేంద్రాల్లో లభించే సే వలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వ చ్చాయి. మెటా, మీ-సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ను మంగళవారం బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రా రంభించారు. మీ-సేవ వాట్సాప్ నంబర్ 8096 95 8096 నుంచి రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్ వంటి ప్రభుత్వ విభాగాల సేవలు పొందవచ్చు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్సేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్‌తో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో తెలంగాణ ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నదని వివరించారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించేలా మీ-సేవ ద్వారా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కిపైగా పౌర సేవలను ఫింగర్ టిప్స్‌పై వాట్సాప్‌లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. త్వరలోనే తెలుగు, ఉర్దూలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.