మహదేవపూర్, డిసెంబర్ 21: కాళేశ్వరం పరిధిలోని లక్ష్మీబరాజ్ ప్రా జెక్టు పిల్లర్ల మరమ్మతు పనులకు ఇబ్బందులు కలగకుండా మొదటగా వాటర్ డైవర్షన్ పనులు ప్రారంభించి పూర్తి చేసినట్టు సమాచారం. యంత్రా లు, మెటీరియల్ తరలించేందుకు వీ లుగా బరాజ్ పైభాగం నుంచి కింది వ రకు కాఫర్‌డ్యాం (550 మీటర్ల పొ డవు) పనులు గతంలోనే ప్రారంభించగా కొనసాగుతున్నాయి. కాఫర్ డ్యాం పూర్తయితేనే మరమ్మతులు సులువుగా చేసేందుకు వీలవుతుంది.