వరంగల్ చౌరస్తా, జనవరి 19 : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతున్నది. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవలకు వసతులలేమి ముప్పుగా మారింది.
నిరాటంకంగా కొనసాగాల్సిన శస్త్రచికిత్సలు యంత్ర పరికరాలు, వైద్య నిపుణుల కొరత కారణంగా నిలిచిపోయాయి. పదిరకాల సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఏర్పా టు చేసిన దవాఖానలో పలు సర్జరీలు కొ నసాగక రోగులు ఇబ్బందిపడుతున్నారు.