చర్ల, జూన్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని వైద్య బృందం ఆదివాసీలను అక్కున చేర్చుకుంటున్నది. కరోనా వేళ వారికి వైద్య సేవలు అందించేందుకు వాగులు దాటుతూ.. కొండలు ఎక్కుతూ.. కిలోమీటర్ల కొద్ది కాలినడక వెళ్లి గూడేల్లోని ప్రజలకు వైద్యం అందిస్తున్నారు ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, హెల్త్ అసిస్టెంట్ స్వరూపారాణి, ఆశ కార్యకర్త భద్రమ్మ. శుక్రవారం వీరు వైద్య పరికరాలు, మందులు, ఇతర సరుకులు మోసుకుంటూ అటవీ మార్గంలో కాలినడకన చర్ల మండలంలోని రాళ్లాపురానికి చేరుకున్నారు. మొబైల్ కొవిడ్ టెస్టింగ్ క్యాంపు నిర్వహించారు. పరీక్షలు చేసి, పలువురికి మందులు పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు.