కాళోజీ వర్సిటీ వీసీకి హెచ్ఆర్డీఏ వినతి
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల పేరిట కొనసాగుతున్న ఫీజు దోపిడీని వెంటనే అరికట్టాలని హైదరాబాద్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కాళోజీ వర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్‌రెడ్డికి ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఆర్డీఏ రాష్ట్ర అధ్యక్షడు డాక్టర్ కార్తీక్ నాగుల, జనరల్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ అజిత్ మాట్లాడుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పాటించకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏ-క్యాటగిరీ, బీ-క్యాటగిరీ సీట్లకు ఫీజులు డిమాండ్ చేస్తున్నాయని మండిపడ్డారు. అడ్మిషన్లను రద్దు చేస్తామని బెదిరించి బలవంతంగా అధిక మొత్తంలో ఫీజులు కట్టించుకుంటున్నాయని తెలిపారు.