హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): పోలియో చుక్కల పంపిణీకి అయ్యే ఖర్చును మీరే పెట్టుకోవాలంటూ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సి బ్బందికి సూచించడంతో ఏఎన్ఎంలు లబోదిబోమంటున్నారు. మాకు వచ్చేదే అంతం త మాత్రం జీతాలు.. రెండు గంటలు అదనంగా పనిచేయమంటే చేస్తాం తప్ప ప్రభు త్వ కార్యక్రమాలకు తమను డబ్బులు ఖర్చుపెట్టమంటే ఎలా అంటూ వాపోతున్నారు. ఈ నెల 12 నుంచి 15 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలియో చుక్కల బాక్స్‌లను ఆరోగ్య కేంద్రం నుంచి ఆయా సెంటర్లకు తరలించేందుకు ఆటోలను అద్దెకు తీసుకుంటారు.
ఇక పోలి యో చుక్కలు వేసేందుకు వైద్య సిబ్బందికి సహకరించే నర్సింగ్ విద్యార్థులు, ఆశాలు, స్వచ్ఛంద కార్యకర్తలకు స్టయిపెండ్ రూపంలో రోజుకు రూ.75 చొప్పున చెల్లిస్తారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఈసారి పోలియో చుక్కల పంపిణీకి అయ్యే ఖర్చులను ఏఎన్ఎంలే భరించాలని, బిల్లులు వచ్చిన తరువా త ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తామని అధికారులు సూచించడంతో ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. ‘పల్స్ పోలియో కార్యక్రమం గురించి అధికారులకు ఆ మాత్రం సోయి లేకపోతే ఎలా? ముందస్తు ప్రణాళికలు రూపొందిచుకోరా? కిందిస్థాయి ఉద్యోగులతో ఖర్చులు పెట్టిస్తారా? ఇదెక్కడి అన్యాయం?’ అంటూ సిబ్బంది మండిపడుతున్నారు.
సెలవు వచ్చినందుకే!
‘పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన బిల్లులు మంజూరయ్యాయి. ఈ నెల 11న రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం రెండు రోజులు బ్యాంక్‌లకు సెలవులు కావడంతో డబ్బులు డ్రా చేయడం కుదరలేదు. ఖర్చులు పెట్టమని మేము ఎవరికీ చెప్పలేదు. పోలియో చుక్కల మందు పంపి ణీ, రవాణా కోసం వినియోగించే ఆటోలను మాత్రమే మేనేజ్ చేసుకోమని చెప్పాం. సోమవారం బిల్లులు చెల్లిస్తాం.
-డాక్టర్ శ్రీకళ, ఇమ్యునైజేషన్ అధికారి