ములుగు, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : మేడారం మాస్టర్ ప్లాన్‌పై ఇంకా తుది నమూనాను ఖరారు చేయలేదని మంత్రి సీతక్క పేరుతో వాట్సాప్ అఫిషియల్ పేజీ అయిన ‘మినిస్టర్ ఫర్ పీఆర్ఆర్డీ తెలంగాణ’ ద్వారా వెల్లడించారు. మాస్టర్ ప్లాన్‌పై అనవసర రాద్ధ్దాంతం చేయడం తగదని పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సమ్మక్క-సారలమ్మ పూజారుల విశ్వాసాలు, లక్షలాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొన్న తరువాతే డీపీఆర్‌ను ఫైనల్ చేస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన అనంతరం మాస్టర్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సమ్మక్క-సారలమ్మ త్యాగాలు, ఆదివాసీల తెగువ, పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటుందని వివరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న ప్రీ పోస్ట్‌మెట్రిక్ సాలర్షిప్ల మొత్తాన్ని పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విజ్ఞప్తి చేశా రు. వికసిత్ భారత్- 2047 రోడ్ మ్యాప్ రూపకల్పనలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రి డాక్టర్ వీరేంద్రకుమార్ అన్ని రాష్ర్టాల మంత్రులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కేంద్రానికి పలు సూచనలు చేశారు.
ప్రీ పోస్ట్‌మెట్రిక్ సాలర్షిప్లను 60శాతం నుంచి 75శాతానికి పెంచాలని, జాతీయస్థాయి సంస్థల్లో సీట్లు సాధించిన ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100శాతం సాలర్షిప్ ఇవ్వాలని కోరారు. సమావేశంలో స్త్రీ, శిశుసంక్షేమ, దివ్యాంగులశాఖల కార్యదర్శి అనితా రామచంద్రన్, ఎస్సీ డీడీ ముఖ్య కార్యదర్శి జ్యోతిబుద్ధ ప్రకాశ్, దివ్యాంగులశాఖ డైరెక్టర్ శైలజ, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు.