చేగుంట, జూన్ 12: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి గుండెపోటుతో అక్కడ మృతిచెందాడు. పది రోజులైనా మృతదేహం స్వగ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది కిరణ్ (35) గతేడాది మే నెలలో బతుకు దెరువుకోసం దుబాయ్ వెళ్లాడు. ఈ నెల 2న గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. కిరణ్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సహాయాన్ని ఆశ్రయించారు. అధికారులు స్పందించి దుబాయ్‌లోని రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ సాయికిరణ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కిరణ్‌కు భార్య నాగలక్ష్మి, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.