మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయరు.. కొన్న లారీలు రావడం లేదంటూ రాస్తారోకో చేశారు.
ధాన్యం తూకం వేసినప్పటికీ లారీలు రాకపోవడంతో వరి కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. లారీ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం తోని సకాలంలో ధాన్యం మిల్లులకు చేరడం లేదని రైతుల ఆరోపించారు.