ఓవర్ లోడింగ్ నియంత్రణకు చర్యలు
రాష్ట్రంలో ఖనిజాలు రవాణా చేసే వాహనాలు తరచూ ఓవర్ లోడింగ్‌కు పాల్పడుతుండటంతో.. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు, ప్రమాదాల నివారణకు రాష్ట్ర రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకోనున్నట్టు శుక్రవారం తెలిపింది.
- త్వరలో వేబ్రిడ్జి ఆధారిత ధ్రువీకరణ, డ్రైవర్ రిజిస్ట్రీ
- రవాణా, గనుల శాఖలతో ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్’
- ఆయా శాఖల సంయుక్త సమావేశంలో పలు నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఖనిజాలు రవాణా చేసే వాహనాలు తరచూ ఓవర్ లోడింగ్‌కు పాల్పడుతుండటంతో.. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు, ప్రమాదాల నివారణకు రాష్ట్ర రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకోనున్నట్టు శుక్రవారం తెలిపింది. రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, గనులు, భూగర్భశాస్త్ర శాఖ ఎండీ, ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ అనుదీప్‌తో సంయుక్త సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఓవర్ లోడింగ్ నియంత్రణకు వేబ్రిడ్జి ఆధారిత ధ్రువీకరణతోపాటు డ్రైవర్ రిజిస్ట్రీని రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ, గనులు భూగర్భశాస్త్ర శాఖలతో కలిపి ప్రత్యేకంగా ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్’ ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఒకే వాహనంపై పదేపదే ఓవర్ లోడింగ్ గుర్తింపులు నమోదైతే చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా మైనింగ్ రవాణా వాహనాలకు కూడా డ్రైవర్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో రవాణాశాఖ అదనపు కమిషనర్ రమేశ్, జేటీసీలు చంద్రశేఖర్‌గౌడ్, శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

