బజార్హత్నూర్, జూలై 27 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆదివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా పూరి, ఆలూకర్రీ అందించాల్సి ఉండగా.. మాడిపోయిన కిచిడీ పెట్టడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నా రు. దీనికితోడు మినరల్ వాటర్ ప్లాంట్‌లో నీళ్లు నింపకపోవడంతో తాగేందుకు మంచినీరు లేక పాఠశాల మరుగుదొడ్ల నుంచి వెళ్లే మిషన్ భగీరథ పైపులైన్ నీళ్లనే తాగుతున్నారు. వర్షాలకు పాఠశాల ఆవరణ బురదమయంగా మారడం తో బురద మధ్యలోనే ఆరుబయట భోజనం చేశారు. పాఠశాల హెచ్‌డబ్ల్యూవో ప్రేంసాగర్‌ను వివరణ కోరగా.. మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. పైనుంచి మైదాపిండి సరఫరా కాకపోవడంతోపాటు కట్టెలు నానడంతో కిచిడీ చారు పెట్టామని వెల్లడించారు.
చిన్నారుల జీవితంతో రాజకీయమా? ; ఎంపీ చామలపై ఎర్రోళ్ల ఫైర్
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): నాగర్ కర్నూల్ జిల్లాలో గురుకుల విద్యార్థులు కలుషితాహారం తిని దవాఖాన పాలైనా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి కనిపించడం లేదని కార్పొరేషన్ మాజీ చైర్మ న్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం ఎక్స్‌లో మం డిపడ్డారు. చిన్నారుల జీవితాలతో రాజకీయం చేస్తుండటం సిగ్గుచేటని ధ్వజమెత్తా రు. ఫుడ్ పాయిజన్ అయింది అబద్ధమా? విద్యార్థులను దవాఖానలో చేర్పించింది అబద్ధమా? పత్రికలు, టీవీలో వచ్చిన వార్తలు అబద్ధమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. బాధిత విద్యార్థులను హరీశ్‌రావు పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి దొంగచాటుగా అమ్మ ఒడి వాహనాల్లో విద్యార్థులను తరలించడం అబద్ధమా? అని నిలదీశారు.