హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): ఆయిల్‌ఫెడ్‌లో అధికారులను బదిలీ చేస్తూ ఎండీ యాస్మిన్ బాషా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేనేజర్(టెక్నికల్) ఓఎస్పీ సత్యనారాయణను బదిలీ చేసి మేనేజర్(కన్జ్యూమర్ మార్కెటింగ్)తోపాటు ఓపీడీ ఇన్చార్జి మేనేజర్‌గా నియమించారు. మేనేజర్(ఓపీడీ) ప్రవీణ్‌రెడ్డిని బదిలీ చేసి భువనగిరి జిల్లా ఇన్చార్జిగా నియమించారు.
మేనేజర్(టెక్నికల్) కళ్యాణ్‌ను కాపాడియా ఇన్చార్జిగా బదిలీ అయ్యారు. సునీతా కుమారిని మేనేజర్(ఫైనాన్స్) ఇన్చార్జిగా, స్వర్ణలతను డిప్యూటీ మేనేజర్(ఓపీడీ)గా నియమించారు.