ముంబై : మహారాష్ట్రలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది. ఇకపై స్థానిక భాష మరాఠీ వస్తేనే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు కొనసాగుతాయి. లేకపోతే రద్దవుతాయి. ఆటో రిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాషలో పనికి సరిపడా పరిజ్ఞానం లేకపోతే వారి లైసెన్స్‌లను మూడు నెలల పాటు రద్దు చేస్తారు.
అదే సమయంలో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన వారి లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేయవచ్చు. మరాఠీ భాష అర్హతను నెరవేర్చని డ్రైవర్లపై చర్య కోసం బుధవారం చట్టాన్ని రాష్ట్ర సర్కార్ సవరించింది.