హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ రిటైర్డ్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉన్నదని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్‌లో రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షిక సమావేశం జరిగింది.
ప్రజారవాణా వ్యవస్థ బాగుకోసం రిటైర్డ్ ఉద్యోగులు అకుంఠిత దీక్ష, క్రమశిక్షణతో చేసిన సేవలు గొప్పవని సజ్జనార్ కొనియాడారు. ఈ సందర్భంగా 75 ఏండ్లు నిండిన 41 మంది రిటైర్డ్ అధికారులను సన్మానించారు.