హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరానికి కన్వీనర్ కోటా ప్రవేశాల రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశించిన గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. శుక్రవారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
అభ్యర్థులు గడువులోగా తమ సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా https://tsmedadm.tsche.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాల కోసం 9392685856, 9059672216, 7842136688 నంబర్లను సంప్రదించాలని కోరింది.