హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆగ్నేయ ప్రాంతం నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టు తెలిపింది. వరంగల్ జిల్లా పాలకుర్తిలో అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. హైదరాబాద్లో 35 డిగ్రీలకుపైగా నమోదైనట్టు వెల్లడించింది. ఎండలు పెరుగుతుండటంతో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొంది.