హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య, జిమ్మిబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న మత్తయ్య పేరును క్వాష్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. తన క్వాష్ ఆధారంగా సీఎం రేవంత్రెడ్డి తప్పించుకోజూస్తున్నారని మత్తయ్య తెలిపారు. రెండు రోజుల వాదనాల అనంతరం గురువారం ఎలాంటి చర్చ జరపకుండానే ధర్మాసనం ఈ కేసును నవంబర్ 3కు వాయిదా వేసింది.
ఏసీబీ నోటీసులు, సీఆర్పీసీ ఆధారంగా ఈ కేసులో పిటిషనర్లుగా తాము కూడా చేరే ఉద్దేశంతో ఈనెల 14న ఇంప్లీడ్ పిటిషన్ ఫైల్ చేసినట్టు తెలిపారు. మత్తయ్య తెలిపారు. నవంబర్ 3న జరుగనున్న విచారణలో మత్తయ్య, జిమ్మీబాబుల తరపు న్యాయవాదులు ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని కోరనున్నారు. ఏసీబీ, ఎన్నికల చట్టాలు కాకుండా ప్రజాప్రతినిధులకు లంచం ఇచ్చే కేసుగానూ దీనిని పరిగణించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అనర్హులుగా ప్రకటించాలని వాదించనున్నారు.