Inter Exams | ఇంటర్లో మ్యాథ్స్-1బీ ఇక ఈజీ.. 60 మార్కులకే ఫైనల్ ఎగ్జామ్!
Inter Exams | ఇంటర్ గణితం-1బీ. ఈ సబ్జెక్టును తలచుకుంటేనే విద్యార్థులు భయపడిపోతారు. అంత కఠినంగా ఉంటుంది. విద్యార్థులను ఇంతకాలం భయపెట్టిన ఈ సబ్జెక్టు కాస్త సులభంకానున్నది. అత్యంత కఠినమైన పాఠ్యాంశాలను పుస్తకాల నుంచి అధికారులు తొలగించారు.
Inter Exams | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ గణితం-1బీ. ఈ సబ్జెక్టును తలచుకుంటేనే విద్యార్థులు భయపడిపోతారు. అంత కఠినంగా ఉంటుంది. విద్యార్థులను ఇంతకాలం భయపెట్టిన ఈ సబ్జెక్టు కాస్త సులభంకానున్నది. అత్యంత కఠినమైన పాఠ్యాంశాలను పుస్తకాల నుంచి అధికారులు తొలగించారు. విద్యార్థులను భయపెట్టే సబ్జెక్టుల్లో కెమిస్ట్రీ కూడా ఒకటి. ఈ సబ్జెక్టు కూడా విద్యార్థులను వణికిస్తుంది. ఈ సబ్జెక్టులో 30% సిలబస్‌కు కోతపడనున్నది. మరికొన్ని సబ్జెక్టుల్లోనూ 20% సిలబస్ తగ్గించారు. తొలిసారిగా ఇంటర్ పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో ముద్రించనున్నారు. అంతేకాకుండా వీటిని మల్టీకలర్స్‌తో ముద్రిస్తారు.
ఈ కొత్త పుస్తకాలు 2026 -27 విద్యాసంవత్సరం (వచ్చే విద్యాసంవత్సరం) నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇంటర్ సిలబస్‌ను అధికారులు సమీక్షించారు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పోల్చితే మన సిలబస్ అధికంగా ఉన్నట్టు నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని కొత్త సిలబస్‌కు రూపకల్పన చేశారు. తెలుగు, చరిత్ర పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, కల్చర్ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం కల్పించారు. ఈ సిలబస్ ఆధారంగా తెలుగు అకాడమీకి పుస్తకాల ముద్రణ బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ రెండో వారంలోగా కొత్త పుస్తకాలు మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. కొత్త సిలబస్‌పై వేసవి సెలవుల్లో లెక్చరర్లకు శిక్షణ ఇస్తారు.
మార్పులిలా..
- ఇక నుంచి ఆర్ట్స్ కోర్సుల్లో 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్ పరీక్షలు ఉంటాయి.
- గణితం పరీక్షను ఇక నుంచి 60 మార్కులకే నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 75 మార్కులకు నిర్వహించగా, 15 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి.
- సైన్స్ కోర్సుల్లో 30 మార్కులు ప్రాక్టికల్స్ ఉండగా, మొదటి సంవత్సరంలో 15 మార్కులు ఇంటర్నల్స్ ఉంటాయి. సెకండియర్‌లో 15 మార్కులు ఎక్స్టర్నల్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి.
- కొత్తగా అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్(ఏసీఈ) కోర్సును అందుబాటులోకి తీసుకొస్తారు. సీఈసీ, ఏసీఈ పుస్తకాలు వేర్వేరుగా ఉంటాయి.
- ఇది వరకు ఎంఈసీ కోర్సులో గణితం సబ్జెక్టుకు 150 మార్కులకు పరీక్షలు నిర్వహించి, 100% మార్కులు లెక్కించేవారు. కానీ ఇప్పుడు 100 మార్కులకే పరీక్ష ఉంటుంది. 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి.
- ఈ సారి పుస్తకాలను సమాంతరంగా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఇది వరకు ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు ముద్రించిన ఏడాదికి ఉర్దూ మీడియం పుస్తకాలు వచ్చేవి. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంతోపాటే ఉర్దూ మీడియం పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు.
- పుస్తకాల ముద్రణను వినియోగించే పేపర్‌ను మార్చారు. ఈ సారి 70జీఎస్ఎం, ఎస్ఎస్ మ్యాప్‌లితో పేపర్‌ను వినియోగిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

