Basara | బాసర : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాసరలో అమ్మవారు గురువారం తొలి రోజు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పించారు.
వరంగల్ : వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో తొలి రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.