e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home తెలంగాణ దుర్భిక్షం కనుమరుగు

దుర్భిక్షం కనుమరుగు

రాష్ట్రంలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు
నివేదిక విడుదల చేసిన భూగర్భ జలవనరుల శాఖ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గంగమ్మ పైపైకి ఉబికి వస్తున్నది. ఒకప్పుడు దుర్భిక్షంగా కనిపించిన ప్రాంతాలు నేడు కనుమరుగవుతున్నాయి. గతేడాది మార్చితో పోల్చితే రాష్ట్రంలో భూ గర్భ జలాలు 2.16 మీటర్లు పైకి వచ్చాయి. రాష్ట్రంలో 8.35 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర భూగర్భ జలశాఖ నివేదికను విడుదల చేసింది. భూగర్భ జలాలకు సంబంధించి 33 జిల్లాల్లో 973 బావులపై పరిశోధన నిర్వహించింది. గతంతో పోల్చితే ఆరు జిల్లాల్లో భూగర్భ జలమట్టం స్వల్పంగా తగ్గగా.. మిగతా అన్ని జిల్లాల్లోనూ పెరుగుద ల నమోదైంది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో గరిష్ఠంగా నమోదయింది. సంగారెడ్డి జిల్లాలో 8.11 మీటర్లు పైకిరాగా.. రంగారెడ్డి జిల్లాలో 7.93 మీటర్లు పెరిగాయి. వనపర్తి జిల్లాలో భూగర్భజలాలు 3.5 మీటర్ల లోతులోనే ఉన్నాయి. 24 జిల్లాల్లో 5-10 మీటర్ల లోతులో, ఎనిమిది జిల్లాల్లో 10 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో ఉన్నాయి.

18 శాతం ప్రాంతంలో 5 మీటర్ల కంటే తక్కువే
20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్న ప్రాంతాలను దుర్భిక్ష ప్రాంతాలు (రెడ్‌ జోన్‌)గా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల విస్తీర్ణం గత పదేండ్లలో పోల్చితే రాష్ట్రంలో భారీగా తగ్గింది. మార్చి 2011-2020 వరకు రాష్ట్రం లో రెడ్‌జోన్‌ విస్తీర్ణం 7,302 చదరపు మీట ర్లు (7 శాతం)గా ఉండగా.. ఈ ఏడాది మార్చిలో పరిశీలిస్తే దీని విస్తీర్ణం 1,651చదరపు మీటర్లు (1.5 శాతం)కు తగ్గింది. 5 మీటర్ల కన్నా తక్కువ లోతులో భూగర్భజలాలు ఉన్న ప్రాంతం 2011-20 మార్చి వరకు 4,578 చ.మీ (4శాతం)ఉండగా.. ప్రస్తుతం 20,722 చ.మీ (18శాతం)కు పెరిగింది. జగిత్యాల, దక్షిణ తూర్పు ఆదిలాబాద్‌, పడమర ఆసిఫాబాద్‌, పడమర మంచిర్యాల, తూర్పు నిర్మల్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, తూర్పు కరీంనగర్‌, మహబూబాబాద్‌, మధ్య-పడమర ఖమ్మం, మధ్య సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, పడమర నారాయణపేట, నల్లగొండ, ఉత్తర-తూర్పు గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో అతి తక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దుర్భిక్షం కనుమరుగు

ట్రెండింగ్‌

Advertisement