కరెంట్ కట్ రాత్రి దాకా ఎప్‌సెట్
ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొన్నది. తొలిరోజు మంగళవారం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షకు ఆటంకాలు ఎదురయ్యాయి.
- తొలిరోజు పరీక్షకు విద్యుత్తు అంతరాయం
- కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని పలు కేంద్రాల్లో 50 నిమిషాల దాకా ఆలస్యం
- జనరేటర్లతో ఎగ్జామ్ నిర్వహించిన సిబ్బంది
- విద్యార్థుల అవస్థ.. తల్లిదండ్రుల ధర్నా
- అదనపు సమయం కేటాయించిన అధికారులు
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) / తిమ్మాపూర్ : ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొన్నది. తొలిరోజు మంగళవారం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షకు ఆటంకాలు ఎదురయ్యాయి. వీటన్నింటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొంటున్నా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టలేదు. వర్షం, ఈదురుగాలులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలకు సిద్ధం కాలేదు. ఫలితంగా ఎప్‌సెట్ నిర్వహణలోని పలు పరీక్ష కేంద్రాల్లో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా కేంద్రాల్లో జనరేటర్, యూపీఎస్ వెలుగుల్లోనే పరీక్షను ఆలస్యంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ సెంటర్లో మధ్యాహ్నం రెండో సెషన్ పరీక్ష 55 నిమిషాల పాటు ఆలస్యంగా జరిగింది.
వర్షం రాకతో పరీక్ష కేంద్రంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత జనరేటర్ ఏర్పాటు చేసినా పక్కనే పిడుగు పడటంతో సిస్టమ్స్ హ్యాంగ్ అయి పరీక్షకు అంతరాయం కలిగింది. పరీక్ష ఆగిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు భావించి కాలేజీ వద్ద రోడ్డుపై ధర్నా చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్ష 6గంటలకు తిరిగి ప్రారంభించామని, ఆగిపోయిన సమయానికి అదనపు సమయం ఇచ్చి రాయిస్తున్నామని సెంటర్ సూపరింటెండెంట్ శ్రీధర్‌రెడ్డి తల్లిదండ్రులకు చెప్పినా వినకుండా దాదాపు గంట సేపు రోడ్డుపై భీష్మించారు.
రాత్రి 8 గంటల సమయంలో విద్యార్థులు పరీక్ష రాసి బయటకి రావడంతో ఉత్కంఠకు తెరపడింది. అదేవిధంగా, వరంగల్ జిల్లాలోని మరో పరీక్ష కేంద్రంలో విద్యుత్తు అంతరాయం తలెత్తగా, 15 నిమిషాలు పరీక్షకు అంతరాయం ఏర్పడింది. నల్లగొండలోని మరో పరీక్షాకేంద్రంలో ఉదయం పూట 15 నిమిషాల పాటు పరీక్ష ఆలస్యంగా పూర్తయింది. ఆయా పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులకు నష్టం కలగకుండా పరీక్ష నిలిచిన సమయం నుంచి తిరిగి పరీక్షలను కొనసాగించారు. అంతరాయం తలెత్తిన సమయానికి తగినట్టుగా అదనపు సమయాన్ని కేటాయించడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
తొలిరోజు 90% విద్యార్థుల హాజరు
ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 90శాతానికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల్లో పరీక్షకు ఉదయం సెషన్లో 33,500 మందికి 30,288 (90.41శాతం), మధ్యాహ్నం సెషన్లో 33,505 మందికి 30,571 (91.24శాతం) విద్యార్థులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

