హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. 23 సభ్యుల పదవుల కోసం 203 మంది న్యాయవాదులు పోటీ పడ్డారు. అందులో ఐదు పదవుల కోసం 55 మంది మహిళా న్యాయవాదులు బరిలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు కోర్టుల వద్ద 109 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు మధ్య 80% పోలింగ్ నమోదైంది. ఏడేండ్ల తరువాత ఎన్నికలు జరుగడంతో అడ్వకేట్లు భారీగా హాజరయ్యారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద కోలాహలం కనబడింది. కాగా కేసుల విచారణకు చాలా మంది న్యాయవాదులు హాజరుకాలేకపోయారు. దీంతో కేసుల్లో వ్యతిరేక ఉత్తర్వులు జారీ కాకుండా కోర్టులు విచారణను వాయిదా వేశాయి. ఎన్నికల ఓట్ల లెకింపు ఫిబ్రవరి 10న జరుగనున్నది.
ఖైరతాబాద్, జనవరి 30: నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు శుక్రవా రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గంజాయి ముఠా దాడిలో ఆమె కిడ్నీకి తీవ్ర గా యం కాగా, దానిని తొలగించి డయాలసిస్ చేస్తున్నట్టు వెల్లడించారు.