హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): బదిలీల్లో భాగంగా చివరిరోజు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. ఇందులో సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు ఉన్నారు.
మొత్తం 8 మంది జిల్లా రిజిస్ట్రార్లలను బదిలీ చేయగా.. డీఐజీ సుభాషిణికి వరంగల్ జిల్లా రిజిస్ట్రేషన్ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు పలువురు గ్రేడ్-1, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లను బదిలీచేస్తూ స్టాం పులు రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీ జ్యోతిబుద్ధప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.