హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): గనులు, భూగర్భ వనరుల శాఖలో భారీగా అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ జాబితాలో ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు, 21 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 22 మంది అసిస్టెంట్ జియాలజిస్టులు, 33 మంది రాయల్టీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లును వరంగల్‌కు, వరంగల్‌లో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ పీ మధుసూదన్‌రెడ్డిని నిజామాబాద్‌కు బదిలీ చేశారు. వెయింటింగ్‌లో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ కే నర్సింహారెడ్డిని హైదరాబాద్‌కు బదిలీ చేశారు.