హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది. 3 దఫాలుగా ఈ ఎన్నికలను నిర్వహిస్తే బాగుంటుందని డీజీపీ శివధర్‌రెడ్డి తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి విన్నంచిన నేపథ్యంలో 32 మంది ఐపీఎస్‌లను వివిధ స్థానాలకు బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అడిషనల్ డీజీ డీఎస్ చౌహాన్‌కు మల్టీజోన్-2తోపాటు ఏడీజీ (పర్సనల్)గా బాధ్యతలు అప్పగించారు. పలువురు జూనియర్లకు, వెయిటింగ్లో ఉన్న ముగ్గురు కన్ఫర్డ్ ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు.
