Paddy Procurement Scam | ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 21 : వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరుగుతున్నదని ఆరోపిస్తూ ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన బాలేశ్వర్రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు.
మండలంలోని రైస్‌మిల్లుల యజమానులు ఐకేపీ ఇన్చార్జిలు, ఏఈవోలతో కుమ్మక్కై దొడ్డురకం వడ్లను సన్నరకం వడ్లుగా రికార్డులో చూపి, సన్నరకానికి ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో పడగానే వారిని భయపెట్టి ఆ మొత్తాన్ని తిరిగి వసూలుచేసి మిల్లర్ల ఖాతాలకు మళ్లించారని బాలేశ్వర్రెడ్డి ఆరోపించారు.
ఇప్పటికే ఘణపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (క్రైం నెంబర్ 6/2026) నమోదైందని, మార్చి 16న ఆధారాలతో ఫిర్యాదు చేసినా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కుంభకోణంపై విచారణ జరపాలని హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేసినట్టు బాలేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం రూ.30,52,020 దుర్వినియోగం అ యినట్టు స్పష్టమవుతుండగా మొత్త ం కుంభకోణం విలువ రూ.3 కోట్లకు పైనే ఉంటుందని ఆయన తెలిపారు.