ఎన్నికల కమిషన్ పక్షపాతం వల్లే ఓటమి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, అందువల్లనే ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఫలితాలు వెలువడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
- మొత్తం ప్రక్రియలో పారదర్శకత లోపించింది: తృణమూల్ ఎంపీ అభిషేక్ ఆరోపణ
కోల్కతా, మే 9: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, అందువల్లనే ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఫలితాలు వెలువడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మొదటిసారి ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్తోపాటు పలు ప్రభుత్వ ఏజెన్సీలు పూర్తి పక్షపాతంతో వ్యవహరించాయని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ప్రజాస్వామిక సంస్థలు రాజీపడినట్టు కనిపిస్తున్నదని, ఫలితంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పారదర్శకత, విశ్వసనీయత లోపించిందని, ఇది తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా నుంచి సుమారు 30 లక్షల మంది పేర్లను తొలగించారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని, వీవీపీఏటీ స్లిప్ల లెక్కింపు పారదర్శకంగా జరిగిందో లేదో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంస్థలు ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించినప్పుడే సమాజంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందని పేర్కొన్నారు. నిజానిజాలు వెల్లడించేందుకు జరిగే పోరాటంలో తాను ప్రతి తృణమూల్ కార్యకర్తతో భుజం భుజం కలిపి పోరాడుతానని, వారికి ఎప్పటికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

