Groups Exams | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): హాల్టికెట్ నంబర్ లేదా ప్రశ్నప్రతం నంబర్ తప్పుగా రాయడం, గడులను సక్రమంగా నింపకపోవడం, ఒకసారి నింపిన గడులను తప్పు అని తెలుసుకొని చెరిపివేయడం వంటి చిన్న చిన్న పొరపాట్లు పోటీ పరీక్షల అభ్యర్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. చిన్న పొరపాటే పెద్దశిక్షకు దారితీస్తున్నాయి. ఇలాంటి తప్పిదాల కారణంగా గ్రూప్స్ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటుపడింది. కొందరు టాప్ మార్కులకు దగ్గరగా ఉన్న వారు సైతం ఫలితాలు చూసుకుని అవాక్కయ్యారు.
జీఆర్ఎల్లో తమ హాల్టికెట్ నంబర్ లేకపోవడం, ఓఎమ్మార్లో చూస్తే తప్పులుండటంతో అయ్యో రామా..! అంటూ నిట్టూర్చాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. గ్రూప్-2, గ్రూప్-3 రెండు పేపర్లలో 31,679 మంది అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. అత్యధికంగా గ్రూప్-3లో 18 వేల మంది, గ్రూప్-2లో 13 వేల మంది ఓఎమ్మార్ షీట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. గ్రూప్-1లో కొంత మంది పేపర్లు ఇన్వాలిడ్ అయ్యాయి. దీంతో ఆయా అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీజీపీఎస్సీ అధికారులు మానవతాదృక్పథంతో తమ ఓఎమ్మార్ షీట్లను లెక్కలోకి తీసుకుని, తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు..