సంగారెడ్డి : బీఆర్ఎస్(BRS)లోకి వలసల జోరు కొనసాగుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో అమలువుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరు తున్నారు. తాజాగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజక వర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు ఉంటుం దన్నారు. అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శివరాజ్ పాటిల్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.