జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కాకతీయ విశ్వవిద్యాల యం దూర విద్యాకేంద్రం డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు సమాచా రం. దీన్ని ప్రోత్సహించేలా సెంటర్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపినట్టు తెలుస్తున్నది. శనివారం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండియన్ హెరిటేజ్ కల్చర్ (ఐహెచ్సీ) పరీక్ష నిర్వహించారు. పాస్ చేయిస్తామని ఒక్కో విద్యార్థి వద్ద రూ.500 వసూలు చేసినట్టు సమాచారం. ఆదివారం డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్న సైన్స్ అండ్ సివిలైజేషన్ పరీక్షకు మళ్లీ రూ.500 తీసుకురావాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై కాకతీయ విశ్వ విద్యాలయం పరీక్షల నియంత్రాణాధికారులను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.