హైదరాబాద్, నవంబర్ 5: హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్స్ సేవలు అందిస్తున్న మారుట్ డ్రోన్స్..సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా 6.2 మిలియన్ డాలర్లు(రూ.50 కోట్లకు పైమాటే) నిధులు సమీకరించుకున్నది. లోక్ క్యాపిటల్ నుంచి సేకరించిన ఈ నిధులను డ్రోన్ల తయారీ సామర్థ్యాన్ని 3 వేల యూనిట్లకు పెంచుకోవడానికి వినియోగించనున్నట్లు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ నిధులతోనే అడ్వాన్స్ అగ్రికల్చరల్ డ్రోన్లను కూడా తయారు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఐదేండ్లలో రూ.1,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..అందుకు తగ్గట్టుగానే ప్రణాళికను వేగవంతం చేసినట్లు తెలిపారు.