మరిపెడ, జనవరి 11 : ఓ వివాహిత సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గ్యామ తండాకు చెందిన గుగులోత్ శైలజకు ఆన్లైన్లో పెట్టుబడి పెడితే ఒకటికి రెండింతలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు. వారి మ మాటలను గుడ్డిగా నమ్మిన ఆమె పలుమార్లు రూ.1.50 లక్షలకుపైగా నగదు బదిలీ చేసింది. కొంతవరకు తిరిగి రాగా.. ఆ తర్వాత తన పెట్టుబడి కూడా దక్కలేదు. మోసపోయానని తెలుసు కున్న శైలజ మనస్తాపానికి గురై గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.